అమెరికాలో మరో నల్లజాతీయుడిపై పోలీసు దాడి.. ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ ఆక్రందన!
- వర్జీనియాలో ఘటన
- కిందపడేసి కొట్టిన వైనం
- మెడపై మోకాలు పెట్టి హింసించిన పోలీసు
నల్లజాతీయుడిపై వర్జీనియా పోలీసు తుపాకీ గురిపెట్టి అతడిని కిందపడేశాడు. అనంతరం మెడపై మోకాలు పెట్టి హింసించాడు. జార్జ్ ఫ్లాయిడ్ మాదిరిగానే ఇతడు కూడా ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ అరిచాడు. అయినప్పటికీ పోలీసు అతడిని విడిచిపెట్టలేదు. చివరకు అతడు గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి. దీంతో ఆ పోలీసుపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.