sunu sood: ఓ వైపు శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు.. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కలిసిన సోనూ సూద్‌

sonu meets maha cm
  • సోనూ సూద్ త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తారన్న రౌత్‌
  • ముంబైకి 'సెలబ్రిటీ మేనేజర్' అయిపోతాడని వ్యాఖ్య
  • మహా సీఎంను సోను కలిశారని ఆదిత్య థాకరే ట్వీట్
  • ఫొటోను పోస్ట్ చేసిన ఆదిత్య
వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలిస్తూ సినీ నటుడు సోనూ సూద్ మానవత్వం చాటుకుంటుండగా ఆయనపై శివసేన నేత సంజయ్‌ రౌత్ నిన్న విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. సోనూ సూద్ త్వరలోనే ప్రధాని మోదీని కలిసి, ముంబైకి 'సెలబ్రిటీ మేనేజర్' అయిపోతాడని వ్యంగ్యంగా అన్నారు.

లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో సోనూ సూద్ అన్ని బస్సులను ఎలా తీసుకువచ్చారని ఆయన నిలదీశారు. అయితే, ఓ వైపు ఆయన విమర్శలు గుప్పించగా, మరోవైపు సోనూసూద్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలవడం విశేషం.

ఉద్ధవ్‌ థాకరేను సోనూసూద్ కలిసి మాట్లాడారని ఆదిత్య థాకరే తెలిపారు. ఆయనతో పాటు మంత్రి అస్లాం షెయిక్ కూడా ఉన్నారని ట్వీట్ చేశారు. అందరం కలిసి, అందరికీ సాయం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
sunu sood
Maharashtra
Corona Virus

More Telugu News