Pocharam Srinivas: కంటతడి పెట్టిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

pocharam tears
  • హంగర్గ గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవం
  • పాల్గొన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  • కొందరు తనపై చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ఆవేదన
  • బాన్సువాడ అభివృద్ధి కోసం కృషిచేస్తున్నానని వ్యాఖ్య 
కొందరు తనపై చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ఆవేదన చెందుతూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కంటతడి పెట్టారు. తాజాగా ఆయన నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చాలా కృషి చేస్తున్నానని, అయితే, కొందరు మాత్రం తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.

బాన్సువాడకు 5,000 ఇళ్లు మంజూరయ్యాయని ఆయన వివరించారు. అవి పూర్తి చేసేందుకు నిధులు సరిపోకపోవడంతో ఎన్నో కష్టాలు పడి నిర్మాణ పనులను పూర్తి చేయిస్తున్నానని తెలిపారు. తాను ఇంతగా కష్టపడుతుంటే కొందరు మాత్రం తనపై పలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
Pocharam Srinivas
TRS
Telangana

More Telugu News