Petrol: రెండో రోజు కూడా స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol diesel price hiked by 60 paisa per litre for second straight day
  • పెట్రోల్, డీజిల్ ధరలపై  60 పైసల చొప్పున పెంపు
  • ఢిల్లీలో నిన్న లీటరు పెట్రోల్ ధర  రూ.71.86
  • ఈ రోజు రూ.72.46
  • లీటరు డీజిల్ ధర ఈ రోజు రూ.70.59
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఈ రోజు దాదాపు 60 పైసల చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఇది వరసగా రెండో రోజు. ఢిల్లీలో నిన్న రూ.71.86 గా ఉన్న లీటరు పెట్రోల్ ధర ఈ రోజు రూ.72.46గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న రూ.69.99గా ఉండగా ఈ రోజు రూ.70.59గా ఉంది.

కాగా, చమురు సంస్థలు నిన్న కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 60 పైసల చొప్పున పెంచాయి. కాగా, కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగకుండా స్థిరంగా ఉన్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి ధరలు మళ్లీ పెరగడం గమనార్హం.

Petrol
diesel
India

More Telugu News