USA: యూఎస్ లోని మిన్నెపోలీస్ నగరంలో పోలీసు వ్యవస్థ ప్రక్షాళన.. పునర్నిర్మాణం... కౌన్సిలర్ల సంచలన నిర్ణయం!

Minneapolis Police Department To Be Dismantled
  • సిటీ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం
  • పోలీసు వ్యవస్థను తిరిగి పునర్నిర్మిస్తాం
  • వెల్లడించిన కౌన్సిల్ ప్రెసిడెంట్
పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన తరువాత వెల్లువెత్తిన నిరసనలు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించగా, ఈ ఘటన జరిగిన యూఎస్ లోని మిన్నెపోలీస్ స్థానిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసి, పునర్నిర్మించాలని సిటీ కౌన్సిలర్లు నిర్ణయించారు.

 "ప్రజా భద్రతా విధానంలో కొత్త పోలీసింగ్ వ్యవస్థకు ఊపిరులూదాలని నిర్ణయించాం. మన సమాజాన్ని సురక్షితంగా ఉంచాలన్నదే మా అభిమతం. మొత్తం పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. తిరిగి పునర్నిర్మిస్తాం" అని కౌన్సిల్ ప్రెసిడెంట్ లీసా బెండర్ మీడియాకు తెలిపారు.

సిటీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని కౌన్సిల్ మెంబర్ అలోండ్రా కానో తెలిపారు. వాస్తవానికి పోలీసు విభాగంలో సంస్కరణలు తేవాలంటే కుదరదని భావించిన తరువాతనే, ప్రస్తుత పోలీసింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని అన్నారు. కాగా, మే 25న జరిగిన ఓ ఘటనలో తెల్లజాతి పోలీసు అధికారి ఒకరు జార్జ్ ఫ్లాయిడ్ మెడపై మోకాలిని అదిమిపెట్టడంతోనే అతను మరణించాడని తేలడంతో, లక్షలాదిమంది నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.
USA
Minnepolice
dismantle
Council

More Telugu News