Chandana: కన్నడ నటి చందన ఆత్మహత్య కేసులో ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!

Lover Dinesh Arrested in Actress Chandana Sucide Case
  • ఇటీవల చందన ఆత్మహత్య
  • సూసైడ్ వీడియోలో ప్రియుడిపై ఆరోపణలు 
  • దినేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
శాండల్ వుడ్ నటి చందన ఆత్మహత్య కేసులో, ఆమె ప్రియుడు దినేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సూసైడ్ వీడియో ఆధారంగా కేసును నమోదు చేసిన పోలీసులు, దినేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, అత్మహత్యకు పాల్పడే ముందు చందన, ఓ వీడియోను తీసి, తనను దినేశ్ ప్రేమించానని చెప్పి నమ్మించి, మోసం చేశాడని ఆరోపించింది. తనను శారీరకంగా వాడుకుని, ఇప్పుడు అన్యాయం చేస్తున్నాడని వాపోయింది. దీంతోనే తనకు జీవితంపై విరక్తి కలిగిందని చెప్పింది. చందన ఆత్మహత్య చేసుకుందన్న వార్త బహిర్గతం కాగానే, దినేశ్ పరారయ్యాడు. ఈ కేసులో చందన తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దినేశ్ ను అరెస్ట్ చేశారు.
Chandana
Dinesh
Lover
Kannada
Sandelwood

More Telugu News