KCR: తెలంగాణలో టెన్త్ పరీక్షలు పూర్తిగా రద్దు?... ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్... నేడు ప్రకటన!

  • నేడు కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం
  • కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్
  • వైరస్ తగ్గక పోవడమే కారణం
Tenth Exams Can be Cancelled in Telangana

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులంతా పాస్ అయినట్టు నేడు ప్రకటన వెలువడుతుందని, ఇంటర్నల్ లేదా ప్రీ ఫైనల్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ విషయంలో నేటి కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడుతుందని సమాచారం.

నేటి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనుండగా, టెన్త్ పరీక్షల నిర్వహణ అంశమే ప్రధాన అజెండా కానుంది. వాస్తవానికి మార్చి నెలలో రద్దు కాబడిన పరీక్షలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి వుంది. అయితే, వైరస్ తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపించక పోవడంతో రాష్ట్ర హైకోర్టు, జంటనగరాల పరిధి మినహా మిగతా ప్రాంతాల్లో పరీక్షలు పెట్టవచ్చని సూచించింది. అయితే, అలా చేయడం సాధ్యం కాదన్న భావనలో ఉన్న సర్కారు, విద్యార్థుల భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పరీక్షల రద్దుకే మొగ్గు చూపినట్టు సమాచారం.

More Telugu News