Chiranjeevi Sarja: సీనియర్ హీరో అర్జున్ కుటుంబంలో విషాదం

Chiranjeevi Sarja dies of cardiac arrest
  • అర్జున్ సోదరుడి కుమారుడు చిరంజీవి సర్జా హఠాన్మరణం
  • గుండెపోటుతో మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు
ప్రముఖ నటుడు అర్జున్ కుటుంబంలో విషాదం నెలకొంది. అర్జున్ సోదరుడి కుమారుడు, కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించాడు. చిరంజీవి సర్జా వయసు 39 సంవత్సరాలు. శనివారం మధ్యాహ్నం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండడంతో చిరంజీవి సర్జాను బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.

అయితే, మృత్యువు ఆ యువనటుడ్ని కబళించింది. ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి సర్జా కార్డియాక్ అరెస్ట్ తో మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. చిరంజీవి సర్జా... అర్జున్ సోదరుడు కిశోర్ సర్జా కుమారుడు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. కన్నడ నాట రీమేక్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని అందరూ అనుకుంటున్న తరుణంలో అర్థంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం కుటుంబసభ్యులను, సాటి నటీనటులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Chiranjeevi Sarja
Death
Cardiac Arrest
Arjun Sarja
Bengaluru
Karnataka

More Telugu News