indrakeeladri: విజయవాడ కనకదుర్గ దర్శనానికి సర్వం సిద్ధం

  • 80 రోజుల పాటు నిలిచిన దర్శనాలు
  • రేపు, ఎల్లుండి  కనకదుర్గ  దర్శనాలకు ట్రయల్స్
  • ఈ నెల 10 నుంచి భక్తులకు అనుమతి
  • గంటకు 250 మంది చొప్పున అనుమతి
indrakeeladri opens tomorrow

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని భక్తులు దర్శించుకోవడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు 80 రోజుల పాటు దర్శనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రేపు, ఎల్లుండి  కనకదుర్గ  దర్శనాలకు ట్రయల్స్ నిర్వహించనున్నారు. దేవస్థాన సిబ్బంది, అధికారులు మాత్రమే ట్రయిల్‌ రన్‌గా దర్శనాలు చేసుకుంటారు.

ఈ నెల 10 నుంచి ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. గంటకు 250 మంది చొప్పున అనుమతిస్తారు. అయితే, అంతరాలయ దర్శనానికి అనుమతులు లేవు. అలాగే, బస్సులు, లిఫ్టులు వంటి సౌకర్యాలు కూడా ఉండవు. భక్తులు మెట్ల మార్గంలో పైకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఉచిత దర్శనం చేసుకునే భక్తులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

More Telugu News