Abde Malek: మోస్ట్ వాంటెడ్ అల్ ఖైదా లీడర్ ఆబ్డే మలేక్ ఖతం: గొప్ప విజయం సాధించామన్న ఫ్రాన్స్

France Troops Killed Most Wanter Al Khaida Leader Abde Malek
  • అల్జీరియా సరిహద్దుల్లో ఘటన
  • ఇస్లామిక్ మాగరేబ్ ఉత్తరాఫ్రికా అధినేతగా మలేక్
  • వెల్లడించిన ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే
అల్ ఖైదా ఇన్ ఇస్లామిక్ మాగరేబ్ ఉత్తరాఫ్రికా అధినేత అబ్డే మలేక్ డ్రౌకడేల్ ను హతమార్చామని, ఎన్నో ఏళ్లుగా తాము చేస్తున్న ఉగ్రవాద పోరాటంలో ఇది గొప్ప విజయమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఉత్తర మాలీలో అబ్డే మలేక్ సహా అతని అనుచరులను ఖతం చేశామని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే స్వయంగా వెల్లడించారు.

అల్జీరియా సరిహద్దుల్లో అతన్ని హతమార్చామని తన ట్విట్టర్ ఖాతాలో పార్లే తెలిపారు. ఇదే సమయంలో వెస్ట్ నేగర్ బార్డర్ ప్రాంతాల్లో అకృత్యాలకు పాల్పడుతున్న ఈఐజీఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ది గ్రేటర్ సహారా) నేతను కూడా తుదముట్టించామని ఆయన అన్నారు. ఈ విషయంలో ఉగ్ర సంస్థల నుంచి ఇంకా ఎటువంటి ప్రకటనా విడుదల కాలేదు.
Abde Malek
Framce
Died
Algeria

More Telugu News