Varla Ramaiah: సుధాకర్ ను శారీరకంగా, మానసికంగా హింసించిన డాక్టర్ రామిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయాలి: వర్ల

Varla Ramaiah responds on Dr Sudhakar incident
  • ఏపీలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం
  • డాక్టర్ రామిరెడ్డి ఫోన్ కాల్స్ పరిశీలించాలన్న వర్ల
  • డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని జార్జ్ ఫ్లాయిడ్ ఘటనతో పోలిక
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో స్పందించారు. చికిత్స సందర్భంగా డాక్టర్ సుధాకర్ ను శారీరకంగా, మానసికంగా హింసించిన డాక్టర్ రామిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయాలని కోరారు. మెంటల్ ఆసుపత్రి సూపరింటిండెంట్, డాక్టర్ రామిరెడ్డిల మధ్య నడిచిన ఫోన్ కాల్స్ ను పరిశీలించాలని సూచించారు.

మెంటల్ ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ కు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను పొరుగు రాష్ట్రాల వైద్య నిపుణులతో పరీక్ష చేయించాలని అన్నారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటనకు, రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ వ్యవహారానికి తేడా లేదని, రెండు ఘటనల్లోనూ పోలీసుల వైఖరి ఒకేలా ఉందని విమర్శించారు. జరుగుతున్న సంఘటనలతో దళిత వర్గాలు వైసీపీ సర్కారు పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారంతో దళిత జాతి వైసీపీకి దూరమైందని అన్నారు.
Varla Ramaiah
Dr Sudhakar
Dr Ramireddy
CBI
YSRCP
Andhra Pradesh

More Telugu News