Sonali Phogat: ప్రభుత్వాధికారిని చెప్పుతో కొట్టిన టిక్ టాక్ స్టార్ పై కేసు నమోదు

Police case filed against tik tok star Sonali Phogat
  • టిక్ టాక్ వీడియోలతో ప్రజాదరణ పొందిన సోనాలీ ఫోగట్
  • మార్కెట్ కార్యదర్శితో ఘర్షణ
  • కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్న ఎస్పీ
హర్యానాకు చెందిన సోనాలీ ఫోగట్ టిక్ టాక్ వీడియోలతో ఎంతో పాప్యులారిటీ సంపాదించింది. స్థానిక బీజేపీ నేతగానూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఓ ప్రభుత్వాధికారిని సోనాలీ చెప్పుతో కొడుతున్న వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు చిక్కుల్లో పడింది. దీనిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇటీవల సోనాలీ బాలాస్మంద్ ప్రాంతంలోని ఓ వ్యవసాయ మార్కెట్  యార్డును పరిశీలించేందుకు వెళ్లగా, అక్కడి మార్కెట్ సెక్రటరీ సుల్తాన్ సింగ్ తో ఆమె ఘర్షణ పడడమే కాదు, అతడ్ని చెప్పుతో ఇష్టంవచ్చినట్టు కొట్టారు. ఈ నేపథ్యంలో, సుల్తాన్ సింగ్ ఫిర్యాదు చేశారని, దాంతో సోనాలీపై కేసు నమోదు చేశామని హిస్సార్ ఎస్పీ గంగారామ్ పునియా వెల్లడించారు. ప్రభుత్వ అధికారిని సోనాలీ అవమానించినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు.
Sonali Phogat
Police
FIR
Sultan Singh
Haryana
TikTok

More Telugu News