Virat Kohli: విడాకులు తీసుకోనున్న విరాట్ కోహ్లీ, అనుష్క.. ట్విట్టర్లో ఇదే మోస్ట్ ట్రెండింగ్!

Kohli and Anushka divorce trending on Twitter
  • ట్విట్టర్ లో చక్కర్లు కొడుతున్న వార్త
  • 2016 నాటి పాత వార్త ఇప్పుడు వైరల్
  • #VirushkaDivorce పేరుతో మోస్ట్ ట్రెండింగ్
ఇండియాలో టాప్ మోస్ట్ సెలబ్రిటీ కపుల్ గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు గుర్తింపు ఉంది. పెళ్లి చేసుకోవడానికి ముందు డేటింగ్ చేస్తున్నప్పటి నుంచి కూడా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ... వైవాహిక జంటలకు మార్గదర్శకంగా నిలిచారు. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో సైతం ఇంటిపట్టునే ఉంటూ తమ ప్రేమానురాగాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. బెస్ట్ కపుల్ గా ఉన్న వీరిద్దరికీ ట్విట్టరాటీలు షాక్ ఇచ్చారు.  

ప్రస్తుతం ట్విట్టర్ లో #VirushkaDivorce (విరుష్క విడాకులు) అనే అంశం టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ఓ పాత వార్త వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ వార్త 2016 ఫిబ్రవరి నాటిది. అప్పుడే వీరిద్దరూ డేటింగ్ స్టార్ట్ చేశారు. అప్పటి వార్త ఇప్పుడు మళ్లీ ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై విరుష్క ఫ్యాన్స్ కూడా సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
Virat Kohli
Anushka Sharma
Divorce
Tollywood
Team India

More Telugu News