Andhra Pradesh: వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ

  • ఇళ్లపట్టాల పంపిణీకి సన్నాహాలు
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా
  • జాబితాలో పేర్లు లేనివాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చన్న సర్కారు
AP Government ready to distribute housing documents

ఏపీ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా కార్యరూపం దాల్చనుంది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇళ్ల పట్టాలను మహిళల పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించనున్నట్టు తెలుస్తోంది.

దళారీలకు, లంచాలకు తావులేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టా అందిస్తున్నామని, గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. పేదల నివాసాల కోసం అభివృద్ధి చేసిన ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించామని, జాబితాలో తమ పేర్లు లేని వాళ్లు నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

More Telugu News