High Court: ఏ విద్యార్థి అయినా కరోనాతో మరణిస్తే ఎవరిది బాధ్యత?: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న

High Court asks Telangana government on Tenth class exams
  • పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ
  • జీహెచ్ఎంసీ పరిధిలోనూ పరీక్షలకు అనుమతి కోరిన సర్కారు
  • నిరాకరించిన హైకోర్టు
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షల అంశం హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై హైకోర్టు కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు సూచించగా, ఆ రెండు జిల్లాల్లోనూ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

దాంతో హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎవరైనా విద్యార్థి కరోనాతో మరణిస్తే ఆ బాధ్యత ఎవరిదని సూటిగా ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు, జీహెచ్ఎంసీ పరిధిలోని టెన్త్ విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని, సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ కింద గుర్తించాలని ఆదేశించింది.
High Court
Telangana
Tenth Class Exams
GHMC
Hyderabad
Ranga Reddy District
Lockdown
Corona Virus

More Telugu News