Chandrababu: రామానాయుడు గారు సినీరంగంలో సంపాదించిన డబ్బును తిరిగి సినిమాకే ఖర్చు చేసి ఎంతోమందికి ఉపాధినిచ్చారు: చంద్రబాబు

Chandrababu remembers Ramanaidu on his birth anniversary
  • ఇవాళ రామానాయుడు జయంతి
  • శతాధిక చిత్రాల నిర్మాత అంటూ కీర్తించిన చంద్రబాబు
  • సినీ, రాజకీయ రంగాలకు ఎంతో సేవ చేశారని వెల్లడి
ఇవాళ మూవీ మొఘల్ రామానాయుడు జయంతి. నికార్సయిన నిర్మాత ఎలావుండాలో తన జీవితం ద్వారా చాటిన రామానాయుడి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఇవాళ పద్మభూషణ్ రామానాయుడు జయంతి సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.  

తాను సినీ రంగంలో సంపాదించిన డబ్బును తిరిగి సినీ రంగం అభివృద్ధికే ఖర్చు చేసి రామానాయుడు ఎంతోమందికి ఉపాధినిచ్చారని కొనియాడారు. భారతదేశంలో 13 భాషల్లో అతి తక్కువ కాలంలో శతాధిక చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారని గుర్తుచేశారు. మాజీ ఎంపీగా బాపట్ల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Ramanaidu
Birth Anniversary
Producer
Tollywood

More Telugu News