Madhavi Latha: తన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో.. వివరణ ఇచ్చిన మాధవీలత!

Actress Madhavi Latha response on her marriage news
  • ఎన్నో నెలల తర్వాత సంతోషంగా ఉన్నానన్న మాధవీలత
  • పెళ్లి చేసుకుందనే అంచనాకు వచ్చిన అభిమానులు
  • ఇంట్లో సంబంధాలు చూస్తున్నారన్న మాధవి
ఎన్నో నెలల తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని... కొత్త జీవితం ప్రారంభమైందని సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. చాలా సంతోషంగా ఉన్నానని... ఏం జరిగిందో త్వరలోనే ప్రకటిస్తానని ఆమె తెలిపింది. దీంతో, మాధవీలత పెళ్లి చేసేసుకుందని అభిమానులు ఒక అంచనాకు వచ్చేశారు. అంతే కాదు  ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం కూడా ప్రారంభించారు. దీంతో, పెళ్లి  అంశంపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని... అన్నీ కుదిరితే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని తెలిపింది. తన ట్వీట్ నేపథ్యంలో, అందరూ తనకు విషెస్ చెపుతుంటే తనకు నవ్వొస్తోందని వ్యాఖ్యానించింది. అందరికీ చెప్పే తాను పెళ్లి చేసుకుంటానని తెలిపింది.
Madhavi Latha
Tollywood
Marriage
BJP

More Telugu News