మరో పురస్కారం దక్కించుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు
- విమానాశ్రయానికి పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్టు ప్లాటినం పురస్కారం
- పర్యావరణహితం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఎయిర్‌పోర్టు
- నీటి వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు
శంషాబాద్ విమానాశ్రయంలో పర్యావరణహితం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. నీటి వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడమే కాకుండా నీటిని ఒడిసిపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగానూ 925 కేఎల్‌డీ సామర్థ్యం కలిగిన ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంతర్జాతీయ పురస్కారం దక్కిందని ఆ విమానాశ్రయ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.