Al Qaeda: ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు మరో ఎదురుదెబ్బ.. ఉత్తర ఆఫ్రికా చీఫ్ అబ్దుల్ మాలిక్ హతం

Al Qaeda chief in north Africa Abdelmalek Droukdel killed
  • ఏడేళ్లుగా వెతుకుతున్న ఫ్రెంచ్ సైన్యం
  • పక్కా సమాచారంతో మట్టుబెట్టిన వైనం
  • మాలి సైన్యంతో కలిసి ఏకకాలంలో దాడులు
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ ఉత్తర ఆఫ్రికా చీఫ్ అబ్దుల్ మాలిక్‌ను ఫ్రెంచ్ సైన్యం మట్టుబెట్టింది. మాలిక్ కోసం ఫ్రెంచ్, మాలి సైన్యాలు ఏడేళ్లుగా గాలిస్తుండగా ఎట్టకేలకు పని పూర్తి చేశాయి.
 
నార్త్ అల్జీరియాలోని పర్వత సానువుల్లో మాలిక్ తలదాచుకున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఫ్రెంచ్ సైన్యం, స్థానిక సైన్యంతో కలిసి దాడి చేసింది. ఉత్తర మాలి, అల్జీరియా ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ దాడుల్లో మాలిక్ మరణించాడు. మాలిక్ మృతిని ధ్రువీకరిస్తూ ఫ్రాన్స్ ప్రకటన విడుదల చేసింది.
Al Qaeda
Abdel Malek
North Africa
dead

More Telugu News