సినీ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ కు హార్ట్ ఎటాక్
- స్టెంట్లు వేసిన వైద్యులు
- నిలకడగా వున్న ఆరోగ్యం
- 'గులాబీ' చిత్రంతో పరిచయమైన శశి
గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు స్టెంట్స్ వేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, శశి ప్రీతమ్ గుండెపోటుకు గురయ్యారనే వార్తతో టాలీవుడ్ ఉలిక్కి పడింది. ఆయన త్వరగా కోలుకోవాలని సినీరంగంలోని వ్యక్తులు ఆకాంక్షిస్తున్నారు.