Donald Trump: త్వరలోనే సంభ్రమాశ్చర్యాలు కలిగించే విషయాలు వింటారు: ట్రంప్

Trump says vaccines are ready to go
  • వ్యాక్సిన్ల పరిశోధనలో మహాద్భుతమైన పురోగతి కనిపించినట్టు వెల్లడి
  • 2 మిలియన్ల వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయన్న ట్రంప్
  • వాటి పనితీరును శాస్త్రవేత్తలు తేల్చాల్సి ఉందని వివరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వ్యాక్సిన్ల పరిశోధనలో మహాద్భుతమైన పురోగతి కనిపించిందని చెప్పారు. వ్యాక్సిన్లు కనుగొనడంలో అమెరికా పనితీరు తిరుగులేని విధంగా ఉందని తెలిపారు.

నిన్న వ్యాక్సిన్ల అంశం మీద సమావేశం నిర్వహించామని అన్నారు. త్వరలోనే అందరూ ఆశ్చర్యం కలిగించే విషయాలు వినబోతున్నారని, బహుశా అది చికిత్స పరమైన అంశాలు కావొచ్చని, అమోఘమైన ఫలితాలు వస్తున్నాయని సెలవిచ్చారు. ఇప్పటికే 2 మిలియన్ల డోసుల మేర వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయని, అయితే అవి సురక్షితమేనని, ప్రభావవంతమైనవని శాస్త్రవేత్తలు తేల్చాల్సి ఉందని, ఆ తర్వాతే వాటిని ముందుకు తీసుకెళతామని వెల్లడించారు.
Donald Trump
Vaccine
Corona Virus
USA
COVID-19

More Telugu News