Boney Kapoor: ముగిసిన బోనీ కపూర్, జాన్వీ, ఖుషీల క్వారంటైన్!

Boney Kapoor and daughters Janhvi and Khushis quarantine ends
  • బోనీ నివాసంలో  ముగ్గురు పనివాళ్లకు కరోనా
  • కుమార్తెలతో కలిసి హోం క్వారంటైన్లోకి వెళ్లిన బోనీ
  • అందరికి నెగెటివ్ నిర్ధారణ అయిందని తెలిపిన బోనీ
దివంగత శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వి కపూర్ (హీరోయిన్), ఖుషీ కపూర్ ల క్వారంటైన్ ముగిసింది. ఈ విషయాన్ని బోనీ కపూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా పరీక్షల్లో తనకు, తన కుమార్తెలకు నెగెటివ్ అని తేలిందని..  తమ నివాసంలో పని చేసే పనిమనుషులు ముగ్గురుకి కూడా నెగెటివ్ అని నిర్ధారణ అయిందని చెప్పారు. తమ పనిమనుషులు పూర్తి  ఆరోగ్యంగా ఉన్నారని... ఇదే సమయంలో తమ 14 రోజుల హోం క్వారంటైన్ కూడా ముగిసిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కరోనా చికిత్స పొందుతున్న వారందరూ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని బోనీ చెప్పారు. ప్రభుత్వ విధివిధానాలను ప్రతి ఒక్కరు తుచ తప్పకుండా పాటించాలని సూచించారు. అందరం కలిసి కరోనాపై విజయం సాధిద్దామని చెప్పారు. తమకు సహకరించిన డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, ముంబై పోలీస్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందరికి కృతజ్ఞతలు చెపుతున్నామని తెలిపారు.

బోనీ కపూర్ ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో... వారిని క్వారంటైన్ కు పంపించారు. తన కుమార్తెలతో కలిసి బోనీ కూడా హోం క్వారంటైన్ లో ఉన్నారు.
Boney Kapoor
Jhanvi Kapoor
Corona Virus
Bollywood

More Telugu News