vijay: హీరో విజయ్‌ సినిమాను విడుదల చేయొద్దు: తమిళనాడు సీఎంను కోరిన దర్శకుడు

  • థియేటర్లు తెరుచుకోగానే మాస్టర్‌ సినిమా విడుదల
  • నిర్ణయం తీసుకున్న తమిళనాడు థియేటర్ల యజమానులు
  • సినిమాకు వేల సంఖ్యలో వస్తారన్న దర్శకుడు కేఆర్
  • కరోనా వ్యాప్తి చెందుతుందని వ్యాఖ్య
dont release master movie

హీరో విజయ్‌ నటించిన 'మాస్టర్' సినిమాను లాక్‌డౌన్ అనంతరం సినిమా థియేటర్లు తెరవగానే విడుదల చేయాలని తమిళనాడు థియేటర్ల యాజమాన్య సంఘం నిర్ణయించుకుంది. కరోనా వల్ల రెండు నెలలుగా తెరుచుకోకుండా భారీ నష్టాల బారిన పడిన థియేటర్ల యజమానులు ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. మొదట ఈ సినిమాను విడుదల చేస్తే చాలా మంది వస్తారని, ఆ తర్వాత ఎప్పటిలాగే అన్ని సినిమాలు చూడడానికి వస్తారని ఆశిస్తున్నారు.

అయితే, థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను ప్రదర్శించడానికి అనుమతివ్వద్దని తమిళనాడు ముఖ్యమంత్రికి సీనియర్ దర్శకుడు కేఆర్ (కోదండ రామయ్య) లేఖ రాశారు. ఈ సినిమా చూడడానికి వేల సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని, కరోనా వ్యాప్తి మరింత వేగమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హీరో విజయ్‌కే చెడ్డ పేరు వస్తుందని ఆయన చెప్పారు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాకి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు.

More Telugu News