elephant: అందుకే ఆ ఏనుగు చనిపోయింది: పోస్టుమార్టం నివేదికలో వెల్లడి

elephant death postmortem
  • పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ తిన్న ఏనుగు
  • 14 రోజుల తర్వాత మృతి
  • తీవ్ర నొప్పిని భరిస్తూ 14 రోజుల పాటు ఏమీ తినని వైనం
  • ఏనుగు మృతికి ఊపిరితిత్తుల వైఫల్యమే కారణం
కేరళలోని మలప్పురంలో ఓ ఆడ ఏనుగును కొందరు దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఆ ఏనుగు పోస్టుమార్టానికి సంబంధించిన నివేదికలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఆ ఏనుగు పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ తిన్న 14 రోజుల తర్వాత చనిపోయిందని తేలింది. నోటిలో పేలుడు పదార్థాల వల్ల అది తీవ్ర నొప్పిని భరిస్తూ 14 రోజుల పాటు ఏమీ తినలేదని తెలిసింది.

నీళ్లు కూడా తాగకుండా ఆకలితో అలమటించి, ఒకరోజు మొత్తం నదిలో ఉండిపోయిందని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. చివరకు ఆ ఏనుగు నీరసించిపోయి నీటిలో పడిపోయిందని వివరించారు. ఆ ఏనుగు మృతికి ఊపిరితిత్తుల వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. కాగా, ఏనుగు చనిపోయే ముందు ఒక రోజు మొత్తం వెల్లియార్‌ నదిలోనే ఉన్న దృశ్యాలు ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
elephant
Crime News
Kerala

More Telugu News