Twitter: కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే: విజయసాయి రెడ్డి!

Vijayasai Reddy Fires Chandrababu
  • మాన్సాస్ ట్రస్ట్ విషయంలో మాటల యుద్ధం
  • ట్రస్ట్ ను కేకులా నాకేస్తాడని అప్పుడే తెలుసు
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి
మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, తన ట్విట్టర్ ఖాతా ద్వారా టీడీపీపై విమర్శలు గుప్పించారు.

"కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వనాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని" అంటూ సెటైర్లు వేశారు.
Twitter
Vijay Sai Reddy
Chandrababu
Mansas Trust

More Telugu News