Tamannaah: పదే పదే కలుసుకునే వాళ్లం.. ఫోనులో ముచ్చట్లు చెప్పుకునే వాళ్లం: శ్రుతి గురించి తమన్నా

tamanna about shriti haasan
  • శ్రుతి హాసన్‌కు నెగిటివిటీ అంటే ఇష్టముండదు
  • ఆమెలోని ఆ గుణమే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌ అయ్యేలా చేసింది
  • శ్రుతిహాసన్‌ ఇప్పటికీ నన్ను ఓ చిన్నపిల్లలానే చూస్తుంది
తన బెస్ట్‌ ఫ్రెండ్‌, హీరోయిన్‌ శ్రుతిహాసన్ గురించి సినీనటి తమన్నా పలు విషయాలు చెప్పింది. సినీ పరిశ్రమలోని నటీనటులందరిలోకి తనకు శ్రుతిహాసన్‌ అంటేనే చాలా ఇష్టమని తెలిపింది. ముంబైలో తమ ఇంటి సమీపంలోనే ఆమె ఇల్లు కూడా ఉండేదని చెప్పింది.

తాము పదే పదే కలిసే వారమని, ఫోనులో ముచ్చట్లు చెప్పుకునే వారమని తెలిపింది. సాధారణంగా తాము తమ సొంత విషయాల గురించి మాట్లాడుకుంటామని, శ్రుతి హాసన్‌కు నెగిటివిటీ అంటే ఇష్టముండదని చెప్పింది. ఆమెలోని ఆ గుణమే తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌ అయ్యేలా చేసిందని తెలిపింది. శ్రుతిహాసన్‌ ఇప్పటికీ తనను ఓ చిన్నపిల్లలానే చూస్తుందని చెప్పింది. కాగా, సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇరువురు హీరోయిన్లు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు.
Tamannaah
shriti haasan
Tollywood

More Telugu News