KIA Motors: అనంతపురం కియా మోటార్స్ కు పాకిన కరోనా... ఉద్యోగికి పాజిటివ్

Corona enters KIA Motors plant as on of its employees tested corona positive
  • తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
  • ఇటీవలే ఫ్యాక్టరీకి వచ్చిన వ్యక్తి
  • క్వారంటైన్ కేంద్రానికి తరలింపు
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్ లోనూ కరోనా ఉనికి వెల్లడైంది. ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టు తేలింది. ఆ ఉద్యోగి కియా మోటార్స్ లోని బాడీ షాప్ లో విధులు నిర్వర్తిస్తుంటాడని, తమిళనాడుకు చెందినవాడని తెలుసుకున్నారు.

ఈ నెల 25న ఇతను కర్మాగారానికి వచ్చాడు. వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడ్ని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ప్రాంగణంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అధికారులు అతడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కియో మోటార్స్ కూడా ఇటీవలే తెరుచుకుంది. అనేక జాగ్రత్తలు తీసుకునే... ఉద్యోగులను లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి కరోనా బారినపడడం అటు సంస్థ యాజమాన్యాన్ని కలవరపెడుతుండగా, ఇటు ఉద్యోగుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. 
KIA Motors
Corona Virus
Employ
Positive
Andhra Pradesh

More Telugu News