Uttam Kumar Reddy: కేసీఆర్ కు ఎందుకంత భయం?... మూడ్రోజుల వ్యవధిలో నన్ను రెండుసార్లు అరెస్ట్ చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy says police has arrested him
  • ఉత్తమ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • మంజీరా పర్యటనకు బ్రేక్
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మంజీరా నీటి పారుదల ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు వెళుతుండగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రైతులు, పారిశ్రామిక కార్మికుల కడగండ్లను మరింత పెంచుతూ మంజీరా ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటుతోందని, ఈ నేపథ్యంలో తాను ప్రాజెక్టు వద్దకు వెళుతుంటే అడ్డుకున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ఎందుకంత భయమో అర్థం కావడంలేదని, తనను మూడ్రోజుల వ్యవధిలో రెండుసార్లు అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
Uttam Kumar Reddy
Arrest
Police
KCR
Manjira

More Telugu News