Stock Market: ఆరు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాలలో స్టాక్ మార్కెట్!

  • ఉదయం లాభాలతోనే మార్కెట్ల ప్రారంభం
  • 129 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 10,029 వద్ద ముగిసిన నిఫ్టీ  
Stock market looses today

ఆరు రోజుల పాటు సాగిన స్టాక్ మార్కెట్ల ర్యాలీకి ఈ రోజు బ్రేక్ పడింది.
ఈ రోజు ఉదయం మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ, కాసేపటికే నష్టాలలోకి జారుకుని.. చివరికి నష్టాలలోనే క్లోజ్ అయ్యాయి. కరోనా వ్యాప్తి ఉద్ధృతం, కార్పోరేట్ ఫలితాల సరళి మార్కెట్లపై ప్రభావాన్ని చూపినట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో సెన్సెక్స్ 129 పాయింట్లు కోల్పోయి 33980 వద్దా, నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 10,029 వద్దా ముగిశాయి.

ఇక, నేటి ట్రేడింగులో వేదాంత, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, విప్రో తదితర కంపెనీల షేర్లు లాభాలు పొందగా; ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, ఏక్సిస్ బ్యాంక్ తదితర షేర్లు నష్టాలను పొందాయి.  

More Telugu News