Anantapur District: అనంతపురం జిల్లాలో దారుణం.. బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

  • మడకశిర మండలం చిన్నమట్లగొంది గ్రామంలో ఘోరం
  • ఇంట్లో ఉన్న బాలికపై గ్రామ వాలంటీర్ దుర్మార్గం
  • తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అత్యాచారం
Village Volunteer rapes girl in Anantapur District

అనంతపురం జిల్లాలో ఘోరం సంభవించింది. అమాయకురాలైన ఓ బాలిక జీవితాన్ని గ్రామ వాలంటీర్ నాశనం చేశాడు. ఇంట్లో ఉన్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని మడకశిర మండలం చిన్నమట్లగొంది గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.  విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు మడకశిర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

More Telugu News