YSRCP: వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్.. నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఆదేశం!

Supreme Court orders AP govt to remove party colours on offices
  • ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల కేసు
  • లేని పక్షంలో కోర్టు ధిక్కారణ కింద చర్యలు
  • ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
ఏపీ ప్రభుత్వానికి కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలంటూ ఇటీవల హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. నాలుగు వారాల్లోగా రంగులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేసింది.
YSRCP
Party colours
Supreme Court

More Telugu News