meera chopra: జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్

meera chopra complaints police
  • సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారని మీరాచోప్రా మండిపాటు
  • తనను దూషిస్తూ కొందరు చేసిన ట్వీట్లు పోస్ట్
  • ఆయా అకౌంట్లను తొలగించాలని ట్విట్టర్‌కు కూడా వేడుకోలు
  • సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు  
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనను సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారని నటి మీరా చోప్రా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్టీఆర్‌ కంటే మహేశ్ బాబునే తాను ఎక్కువగా ఇష్టపడతానని ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తారక్ అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతూ ఆమెను దూషిస్తున్నారు.

దీనిపై ఎన్టీఆర్ స్పందించాలని ఇప్పటికే ఆమె ట్విట్టర్‌లో కోరింది. అయితే ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. దాంతో తనను వేధిస్తున్న నెటిజన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ట్విట్టర్‌ ద్వారా పోలీసులను కోరారు. తనను దూషిస్తూ కొందరు చేసిన ట్వీట్లను ఆమె పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లను గుర్తించి వెంటనే ఆయా అకౌంట్లను తొలగించాలని ట్విట్టర్‌ను కూడా ఆమె కోరారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. #WeSupportMeeraChopra హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.
meera chopra
Tollywood
Junior NTR
Twitter

More Telugu News