Hyderabad: గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్!

Ceiling Fan Collapse in Gandhi Hospital Corona Ward

  • ఏడవ అంతస్తులో కరోనా రోగులకు చికిత్స
  • హుక్ నుంచి ఊడిపడిన ఫ్యాన్
  • తన దృష్టికి రాలేదన్న సూపరింటెండెంట్

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స జరుగుతున్న వార్డులో ఓ సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలోని ఏడవ అంతస్తులో పలువురు పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు.

ఇక్కడ ఉన్న ఓ ఫ్యాన్ అకస్మాత్తుగా హుక్ నుంచి వేరుపడి కిందనే ఉన్న రోగులపై పడింది. ఆ సమయంలో బెడ్ పై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఈ ఘటనతో తాము మరింత భయాందోళనలకు గురయ్యామని రోగులు వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరుగకుండా చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటన తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News