Bhavuk Jain: యాపిల్ లో లోపం కనిపెట్టి జాక్ పాట్ కొట్టిన ఇండియన్!

Delhi Techchie Gets Jackpot From Apple
  • టెక్కీగా పనిచేస్తున్న భావుక్ జైన్
  • ఐడీ లేకుండానే యాపిల్ లో లాగిన్ చాన్స్
  • కనిపెట్టినందుకు రూ. 75 లక్షలు
టెక్ దిగ్గజం యాపిల్ వినియోగిస్తున్న సాఫ్ట్ వేర్ లో ఉన్న ఓ లోపాన్ని కనిపెట్టిన ఢిల్లీ టెక్కీ, సంస్థ నుంచి లక్ష డాలర్ల (సుమారు రూ. 75 లక్షలు) ప్రైజ్ మనీని అందుకోనున్నాడు.

యాపిల్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యే ఆప్షన్ ను సంస్థ అందుబాటులోకి తేగా, ఐడీ లేకుండానే లాగిన్ అయ్యే లోపం అందులో ఉందని కనిపెట్టిన భావుక్ జైన్ అనే యువకుడు, దాన్ని యాపిల్ కు తెలిపాడు. ఆ వెంటనే ఆ లోపాన్ని యాపిల్ సరిచేసుకుంది. లోపాన్ని కనిపెట్టినందుకు అతనికి లక్ష డాలర్ల బహుమతిని అందిస్తామని తెలిపింది. కాగా, భావుక్ జైన్ ఇలా సాఫ్ట్ వేర్లలో లోపాలను పసిగట్టడం ఇదే తొలిసారేమీ కాదు. గతంలో యాహూ, ఫేస్ బుక్, గ్రాబ్, గూగుల్ తదితరాల్లోనూ బగ్స్ కనిపెట్టి భారీ ప్రైజ్ మనీలను పొందాడు.
Bhavuk Jain
Apple
Bug
Login
Prize Money

More Telugu News