Kangana Ranut: హిమాలయాల సమీపంలో విలాసవంతమైన ఇల్లు కట్టుకున్న కంగనా రనౌత్ చెల్లెలు!

Kangana Sisters New Home in Himalayas goes Viral
  • పెళ్లి తరువాత ముంబైలోనే ఉన్న రంగోలీ
  • తన కలల సౌధాన్ని నిర్మించుకున్న వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ రనౌత్, తాను కొత్తగా హిమాలయాల సమీపంలోని ఓ గ్రామంలో నిర్మించుకున్న ఇంటిలో గృహ ప్రవేశాన్ని చేసింది. ఈ ఇంటిని తన అభిరుచులకు అనుగుణంగా అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్న ఆమె, దీనికి 'విల్లా పెగాసున్' అని పేరు పెట్టుకుంది. ఈ పేరుకు గ్రీకు భాషలో 'రెక్కల గుర్రం' అనే అర్థం వస్తుందట.

కాగా, అజయ్ ని పెళ్లాడిన తరువాత రంగోలీ ముంబైలోని ఓ అపార్టుమెంట్ లో తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. ఈ దంపతులకు పృథ్వీ అనే కొడుకు వున్నాడు. ఇక తన కలల సౌధాన్ని మంచుకొండల్లో కట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్న ఆమె, స్వయంగా దగ్గరుండి, ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించుకుంది.

గృహ ప్రవేశం సందర్భంగా సంప్రదాయ పూజలతో పాటు హల్వాను వండామన్న రంగోలీ, తన సోషల్ మీడియాలో ఇంటి చిత్రాలను పోస్ట్ చేసింది. డ్రాయింగ్ రూమ్, హాల్, వరండా తదితర చిత్రాలను అమె పంచుకుంది. రంగోలీ పెట్టిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Kangana Ranut
Rangoly
Home
Himalayas

More Telugu News