హిమాలయాల సమీపంలో విలాసవంతమైన ఇల్లు కట్టుకున్న కంగనా రనౌత్ చెల్లెలు!
- పెళ్లి తరువాత ముంబైలోనే ఉన్న రంగోలీ
- తన కలల సౌధాన్ని నిర్మించుకున్న వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలు
కాగా, అజయ్ ని పెళ్లాడిన తరువాత రంగోలీ ముంబైలోని ఓ అపార్టుమెంట్ లో తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. ఈ దంపతులకు పృథ్వీ అనే కొడుకు వున్నాడు. ఇక తన కలల సౌధాన్ని మంచుకొండల్లో కట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్న ఆమె, స్వయంగా దగ్గరుండి, ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించుకుంది.
గృహ ప్రవేశం సందర్భంగా సంప్రదాయ పూజలతో పాటు హల్వాను వండామన్న రంగోలీ, తన సోషల్ మీడియాలో ఇంటి చిత్రాలను పోస్ట్ చేసింది. డ్రాయింగ్ రూమ్, హాల్, వరండా తదితర చిత్రాలను అమె పంచుకుంది. రంగోలీ పెట్టిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.