KCR: సీఎం కేసీఆర్ కారుకు అడ్డంపడేందుకు వ్యక్తి ప్రయత్నం... అదుపులోకి తీసుకున్న పోలీసులు

 Man tries to halt CM KCR convoy
  • గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించిన కేసీఆర్
  • ప్రగతి భవన్ కు తిరిగి వెళుతుండగా ఘటన
  • వ్యక్తిని సైఫాబాద్ పీఎస్ కు తరలించిన పోలీసులు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు గన్ పార్క్ లో నివాళులు అర్పించారు. అయితే సీఎం కేసీఆర్ గన్ పార్క్ నుంచి ప్రగతి భవన్ కు తిరిగి వెళుతుండగా, ఆయన కాన్వాయ్ కు అడ్డుపడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.

సీఎం కేసీఆర్ కారు ముందుకు అతను ఒక్కదుటున దూకాడు. అయితే సీఎం భద్రతా సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఆ వ్యక్తిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

KCR
Convoy
Police
Formation Day
Telangana

More Telugu News