Whatsapp: పొరబాటున కూడా ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయొద్దు: యూజర్లకు వాట్సాప్ హెచ్చరిక

Whatsapp alerts users do not enter wrong verification number
  • తప్పుడు మెసేజ్ తో జాగ్రత్త అంటున్న వాట్సాప్
  • 6 అంకెల పిన్ ఎంటర్ చేస్తే ఖాతా వివరాలు హ్యాకర్ల పరం
  • తాము ఎప్పుడూ వెరిఫికేషన్ గురించి అడగబోమని వివరణ
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా తన యూజర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ మొబైల్ నెంబర్ ను తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కు ఓ సందేశం ద్వారా తప్పుడు పిన్ నెంబర్ పంపుతారని, పొరబాటున కూడా దాన్ని ఎంటర్ చేయొద్దని స్పష్టం చేసింది. వాట్సాప్ ఖాతా వెరిఫికేషన్ పేరిట మోసానికి తెరలేపుతారని, వారు పంపిన 6 అంకెల పిన్ నెంబర్ ఎంటర్ చేయమని కోరతారని, ఒక్కసారి ఆ నెంబర్ ను ఎంటర్ చేస్తే యూజర్ల ఖాతా వివరాలన్నీ హ్యాకర్ల చేతికి వెళతాయని వాట్సాప్ వెల్లడించింది.

ఇలాంటి తప్పుడు సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పైగా ఈ సందేశాన్ని ఇతరులకు కూడా షేర్ చేయాలని సూచిస్తుంటారని పేర్కొంది.  తాము యూజర్లను ఎప్పుడూ వెరిఫికేషన్ గురించి అడగబోమని, యూజర్లకు తాము పంపే సందేశాలు బ్లూ టిక్ ఉన్న ఖాతా నుంచే వస్తాయని వాట్సాప్ నిపుణుల బృందం వెల్లడించింది. ఒకవేళ, హ్యాకర్లు పంపిన సందేశాలకు స్పందించినప్పుడు మీ ఫోన్ లోని వాట్సాప్ అకౌంట్ నుంచి లాగ్ అవుట్ చేసి, మరోసారి రీ వెరిఫైయింగ్ చేసుకోవాలని నిపుణులు సూచించారు.
Whatsapp
Pin
Verification
Hackers
Users

More Telugu News