Jagan: పాప్యులర్ సీఎంల జాబితాలో 4వ స్థానంలో జగన్

jagan popular cm
  • దేశంలో అత్యధిక పాప్యులారిటీ ఉన్న ముఖ్యమంత్రుల జాబితా
  • విడుదల చేసిన సీ-ఓటర్‌
  • అగ్రస్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 
దేశంలో అత్యధిక పాప్యులారిటీ (ప్రజాదరణ) ఉన్న ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నాలుగో స్థానంలో నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తాజాగా సీ-ఓటర్‌ సర్వేలో ఈ విషయం తేలిందని చెప్పింది.

ఈ జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్ మఖ్యమంత్రి భూపేష్ బఘేల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఉన్నారు. ఇక జగన్‌ తర్వాత ఐదు, ఆరు, ఏడో స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు నిలిచారని వైసీపీ తమ ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంది.
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News