ఉస్మానియా వైద్య కళాశాలలో కరోనా కలకలం... 12 మందికి పాజిటివ్

02-06-2020 Tue 15:56
  • హైదరాబాదులో కరోనా ఉద్ధృతి
  • ఉస్మానియాలో 296 మంది వైద్య విద్యార్థులకు కరోనా పరీక్షలు
  • మరికొందరి ఫలితాలు రావాల్సి ఉందన్న ప్రిన్సిపాల్
Osmania Medical College students tested corona positive

హైదరాబాద్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో చాలామంది విద్యార్థులు హాస్టల్ లోనే ఉంటున్నారు. ఉస్మానియా వైద్య కళాశాల హాస్టల్ లో 296 మంది విద్యార్థులు ఉండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో, 12 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఇంకా మరికొందరి ఫలితాలు రావాల్సి ఉందని మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ వెల్లడించారు.