amreica: చైనా-భారత్ సరిహద్దుల్లో డ్రాగన్‌ చర్యలపై అమెరికా ఆగ్రహం

  • లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా తమ సైనికులను మోహరించింది
  • నియంతృత్వ ప్రభుత్వాలే ఇటువంటి చర్యలకు పాల్పడతాయి
  • ప్రపంచానికి చైనా కరోనా నిజాలు తెలపట్లేదు 
  • పలు ప్రాంతాల్లో సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంటోంది
us on china india   standoff

లడఖ్‌లోని సరిహద్దుల్లో చైనా తమ సైనికులను మోహరించిన విషయంపై అమెరికా విమర్శలు గుప్పించింది. నియంతృత్వ ప్రభుత్వాలే ఇటువంటి చర్యలకు పాల్పడతాయని  అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. చైనా చర్యలు సరికాదని ఆయన చెప్పారు. ఇప్పటికీ సరిహద్దుల్లో సైన్యాన్ని చైనా మోహరిస్తూనే ఉందని ఆయన చెప్పారు. మరోవైపు కరోనా వైరస్‌ విషయంలో ప్రపంచానికి చైనా నిజాలు తెలియజేయడంలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

 హాంకాంగ్‌కు సంబంధించిన బిల్లును తీసుకొచ్చిన చైనా.. అక్కడి ప్రజల స్వేచ్ఛకు తూట్లు పొడిచేందుకు చూస్తోందని పాంపియో ఆరోపించారు. చైనా ప్రపంచ వ్యాప్తంగా అనేక చర్యలకు పాల్పడుతోందని, మేధోహక్కులను కొల్లగొడుతోందని, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ఇంకా ప్రయత్నాలు జరుపుతోందని విమర్శించారు. ఇటువంటి నియంతృత్వ తీరును నిరోధించాల్సిన బాధ్యత, సామర్థ్యం అమెరికాకు ఉన్నాయని చెప్పారు. ఆ దేశం కొన్నేళ్లుగా ఇదే తీరును ప్రదర్శిస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో చైనా‌ తమ సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంటోందన్నారు.

More Telugu News