Devineni Uma: ప్రాణాలు పోతుంటే ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి వైఎస్ జగన్ గారూ: దేవినేని ఉమ

devineni fires on ycp
  • అక్రమ మద్యం, కాపు సారా ఏరులైపారుతుంది
  • ఈ విషయాన్ని మీవాళ్లే చెబుతున్నారు
  • శానిటైజర్లు తాగి 2 రోజుల్లో ఏడుగురి ప్రాణాలు పోయాయి
  • అదనపు ఆదాయం కోసం నాసిరకం మద్యం బ్రాండ్లు తెచ్చారు 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఏపీలో అక్రమ మద్యం ఏరులైపారుతోందని అన్నారు. 'అక్రమ మద్యం, కాపు సారా ఏరులైపారుతుందని మీవాళ్లే చెబుతున్నారు. శానిటైజర్లు తాగి 2 రోజుల్లో ఏడుగురి ప్రాణాలు పోయాయి. 30 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం కోసం మీరుతెచ్చిన అధికధరల నాసిరకం మద్యం బ్రాండ్ల వల్ల ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు పోతుంటే ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి వైఎస్ జగన్ గారూ' అని ఆయన నిలదీశారు.

ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. అధిక మత్తు, కిక్కు కోసం మిథైల్‌ ఆల్కహాల్‌ వంటి విషపూరిత రసాయనాలు, శానిటైజర్లు తాగి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అందులో ఉంది. ఆది, సోమవారాల్లో విశాఖపట్నంలో ఐదుగురు, కడప జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మృతులందరూ భవన నిర్మాణ కార్మికులే.
Devineni Uma
Telugudesam
Jagan

More Telugu News