Peugeot Metropolis 3W: మూడు చక్రాల స్కూటర్ పై మనసు పారేసుకున్న ఆనంద్ మహీంద్రా

Anand Mahindra feels awesome about Peugeot Metropolis scooter
  • చైనా పోలీసులకు సరికొత్త స్కూటర్
  • 'అందాల రాక్షసి'గా అభివర్ణించిన ఆనంద్ మహీంద్రా
  • భారత్ లోనూ ఇలాంటివి బాగుంటాయని వ్యాఖ్యలు
మహీంద్రా సంస్థతో జట్టుకట్టిన ఫ్రెంచ్ స్కూటర్ తయారీదారు ప్యూగట్ రూపొందించిన మూడు చక్రాల స్కూటర్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవలే చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ పోలీసులకు ఈ మూడు చక్రాల స్కూటర్లు అందించారు. గ్వాంగ్ డాంగ్ పోలీసు విభాగం ఈ తరహా స్కూటర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది.

తాజాగా, ఈ ప్యూగట్ మెట్రోపోలిస్ 3డబ్ల్యూ స్కూటర్ ను చూసి మహీంద్రా వ్యాపార సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా అచ్చెరువొందారు. దీన్నొక 'అందాల రాక్షసి'గా అభివర్ణించారు. ప్రత్యేక పోలీసు బృందాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఇలాంటివి భారత్ లోనూ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, దీని తయారీ వ్యయం భారత్ లో ఎంత ఉండొచ్చని మహీంద్రా టూవీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో ప్రకాశ్ వకాంకర్ ను ప్రశ్నించారు.
Peugeot Metropolis 3W
Scooter
Anand Mahindra
Mahindra
China

More Telugu News