Khushboo: ఖుష్బూ బంధువు కరోనాతో మృతి

Khushboo relative dies with Corona
  • ముంబైలో మృతి చెందిన ఖుష్బూ వదిన
  • లాక్ డౌన్ కారణంగా వెళ్లలేకపోయిన ఖుష్బూ
  • ఆమె లేని లోటు తీర్చలేనిదని ఆవేదన
ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ నివాసంలో విషాదం నెలకొంది. ఆమె వదిన కరోనా వైరస్ తో ముంబైలో మృతి చెందారు. దీంతో, ఖుష్బూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన వదిన చనిపోయిన విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రాణాంతక వ్యాధి కారణంగా ఆమె మరణించారని చెప్పారు. తమకు దూరంగా ఈ లోకం నుంచి ఆమె వెళ్లిపోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే లాక్ డౌన్ నేపథ్యంలో వదిన అంత్యక్రియలకు ఆమె వెళ్లలేకపోయారు. చెన్నై నుంచి ముంబై వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు. మరోవైపు ఖుష్బూ ఇంట్లో నెలకొన్న విషాదంపై పలువురు తమిళ సినీ ప్రముఖులు స్పందించారు. ఖుష్బూ వదిన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు.  
Khushboo
Relative
Corona
tollywood

More Telugu News