Raja Singh: గణేశ్ విగ్రహాల తయారీదార్లు అయోమయంలో ఉన్నారు... మార్గదర్శకాలు జారీచేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి

  • కరోనా కారణంగా గణేశ్ చతుర్థి వేడుకలపై అనిశ్చితి
  • విగ్రహాలు చేయాలో, వద్దో తేల్చుకోలేకపోతున్న తయారీదార్లు
  • కనీసం 10 అడుగుల విగ్రహాలకైనా అనుమతి ఇవ్వాలన్న రాజాసింగ్
BJP MLA Raja Singh requests TS CMO

కరోనా రక్కసి తెలంగాణలో విజృంభిస్తున్న నేపథ్యంలో, గణేశ్ విగ్రహ తయారీదార్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈసారి వినాయకచవితి వేడుకలకు అనుమతి ఉంటుందా, లేదా అనేదానిపై అనిశ్చితి నెలకొనడంతో, విగ్రహ తయారీదార్లు ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు.

దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వినాయక విగ్రహాల తయారీదార్లు ఎంతో అయోమయానికి గురవుతున్నారని, వినాయకచవితి వేడుకలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సీఎంవోను కోరారు. వీలైనంత త్వరగా దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలని తెలిపారు. కనీసం 10 అడుగుల వినాయక విగ్రహాల తయారీకైనా అనుమతి ఇవ్వాలని, విగ్రహాల తయారీదార్లకు ఇదొక్కటే ఉపాధి కావడంతో వారిపై సానుభూతితో స్పందించి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవోకు రాజాసింగ్ లేఖ రాశారు.

More Telugu News