Sonu Sood: ఇటువంటి భర్తతో ఉండలేనన్న యువతి... ఇద్దరినీ గోవాకు పంపిస్తానన్న సోనూ సూద్!

Sonu Sood Intresting Reply to a Lady goes Viral
  • లాక్ డౌన్ లో భర్తతో ఉండలేకపోతున్నా
  • సోనూ సూద్ కు ట్వీట్ చేసిన యువతి
  • ఇద్దరినీ గోవాకు పంపిస్తానని సమాధానం
రెండు నెలల క్రితం లాక్ డౌన్ ప్రారంభమైన తరువాత నుంచి వలస కార్మికులు, అత్యవసరాల్లో ఉన్నవారికి ప్రముఖ నటుడు సోనూ సూద్ ఎంతలా సాయం చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మందిని స్వస్థలాలకు చేర్చడంతో పాటు, సినీ కార్మికులను ఆదుకోవడం, వారికి అన్న పానీయాలు అందించడం వంటి ఎన్నో పనులను ఆయన చేపట్టారు. వలస కార్మికులకు ఓ స్పెషల్ ఫ్లయిట్ ను సైతం ఆయన బుక్ చేశారు. సోనూ సూద్ ను పలువురు అభినందిస్తుండగా, మరికొందరు విచిత్రమైన కోరికలను కోరుతూ, వాటిని తీర్చాలని అడుగుతున్నారు కూడా.

తన స్నేహితురాలిని కలవాలని ఉందని, అందుకు సాయం చేయాలని ఇటీవల ఓ యువకుడు సోనూ సూద్ ను అభ్యర్థించగా, తాజాగా అలాంటిదే మరో సమస్య ఆయన ముందుకు వచ్చింది. లాక్ డౌన్ అమలులో ఉన్న వేళ, తన భర్తతో కలిసి కాపురం చేయలేకపోతున్నానని, తన భర్త నుంచి వేరుపడేందుకు సాయం చేయాలంటూ సుష్రియా ఆచార్య అనే యువతి, తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోనూ సూద్ ను కోరింది. జనతా కర్ఫ్యూ నాటి నుంచి తన భర్తతోనే ఉంటున్నానని, ఇప్పుడు అతన్ని బయటకు పంపాలని, లేదా తనను తల్లిదండ్రుల వద్దకు పంపాలని ఆమె కోరింది.

ఇక ఈ ట్వీట్ పై స్పందించిన సోనూ సూద్, తనదైన శైలిలో స్పందిస్తూ, అదిరిపోయేలా రిప్లయ్ ఇచ్చారు. తన వద్ద ఓ ప్లాన్ ఉందని, దాన్ని పాటించాలని సూచించారు. "నా దగ్గర ఓ ప్లాన్‌ ఉంది. మీ ఇద్దరిని గోవా పంపిద్దాం.  ఏమంటారు? " అని ట్వీట్ పెట్టారు. సోనూ సూద్ పెట్టిన ట్వీట్ వైరల్ అయింది.
Sonu Sood
Lady
Husbend
Goa

More Telugu News