'చారిత్రాత్మక నిర్ణయాలు' తీసుకునే అవకాశం.. మోదీ నేతృత్వంలో కాసేపట్లో కేబినెట్ భేటీ
- లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో భేటీ
- ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది
- అనంతరం కేబినెట్ తొలిసారి భేటీ
- లడఖ్‌లో చైనా దుందుడుకు చర్యలపై కూడా చర్చ
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన అనంతరం కేబినెట్ తొలిసారి భేటీ అవుతోంది. కేంద్ర ఆర్థిక, భద్రత కేబినెట్ కమిటీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కరోనా, లాక్‌డౌన్ అంశాలతో పాటు లడఖ్‌లో చైనా దుందుడుకు చర్యలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.