Mahesh Babu: మేనల్లుడ్ని ప్రశంసలతో ముంచెత్తిన మహేశ్ బాబు

Mahesh Babu appreciates Galla Ashok
  • టాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న గల్లా అశోక్
  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చిత్రం
  • కృష్ణ పుట్టినరోజు సందర్భంగా జుంబారే పాట రిలీజ్
మహేశ్ బాబు సోదరి పద్మావతి, గల్లా జయదేవ్ ల తనయుడు గల్లా అశోక్ చిత్ర రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో గల్లా అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డేని పురస్కరించుకుని చిత్రం నుంచి జుంబారే జూజూంబరే అనే పాట రిలీజ్ చేశారు.

అది గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రం యమలీలలో కృష్ణ చేసిన పాట. ఈ పాటకు గల్లా అశోక్ తన చిత్రంలో అదిరిపోయే రేంజ్ లో పెర్ఫామ్ చేశాడు. దాంతో తన మేనల్లుడ్ని మహేశ్ బాబు ఆకాశానికెత్తేశాడు. ఈ పాటలో ఎంత ఎనర్జీ ఉందో అంతా చూపించేశావు అంటూ అశోక్ ను అభినందించాడు. "తెరపై చక్కగా కనిపిస్తున్నావు, ఈ సినిమా చూడ్డానికి వేచి ఉండలేకపోతున్నాను. నీకు, చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. ఇలాగే ఊపేయాలి!" అంటూ ట్వీట్ చేశాడు.

Mahesh Babu
Galla Ashok
Jumbare
Galla Jayadev
Tollywood

More Telugu News