Budda Venkanna: ఈ సుమోటోలేమిటో అంటూ చంద్రబాబుపై విజయసాయి విమర్శలు... ఘాటుగా బదులిచ్చిన బుద్దా

Buddha repiles strongly to Vijayasai Reddy comments
  • సుమోటోగా వెనక్కి వెళ్లాడంటూ విజయసాయి పరోక్ష వ్యాఖ్యలు
  • సుమోటో అంటే మీకు తెలియకపోవడం ఏంటి! అంటూ బుద్ధా ఫైర్
  • విజయసాయిని ఏకిపారేస్తూ విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు, నిమ్మగడ్డపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించగా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. "గ్యాస్ బాధితుల్ని పరామర్శిస్తానని చెప్పి సుమోటోగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెనక్కి వెళ్లాడు ఒకాయన. నేనే ఎన్నికల కమిషనర్ని అంటూ సుమోటోగా ఆర్డర్ ఇచ్చుకున్నాడు ఇంకొకాయన. అసలు ఈ సుమోటోలేమిటో!" అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా బదులిచ్చారు. సుమోటో అనే పదం మీకు అర్థం కాకపోవడం ఏంటి విజయసాయిరెడ్డీ అంటూ ప్రశ్నించారు.

"సుమోటోగా 16 నెలల జైలుశిక్ష మీకు తెలియదా? 11కేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలు... సుమోటోగా చేసుకున్నవే! జగన్ మిమ్మల్ని సుమోటోగా కారులోంచి దించేసి విశాఖ బాధ్యతల నుంచి తొలగించారని టాక్ వినిపిస్తోంది. సుమోటోగా చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చారు. అంతలోనే వెన్నులో వణుకుపుట్టి విమానాలు రద్దు చేశారు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
Budda Venkanna
Vijayasai Reddy
Chandrababu
Nimmagadda Ramesh
Sumoto
Andhra Pradesh

More Telugu News