అచ్చెన్నాయుడు గ్రామంలోనే చర్చ... రెడీయా?: కిల్లి కృపారాణి సవాల్!
- నిమ్మాడలో వైసీపీకి ఓట్ల పడలేదా
- అక్కడ అమ్మఒడి, రైతు భరోసా లేదని నిరూపిస్తారా?
- బహిరంగ చర్చకు సిద్ధమన్న కిల్లి కృపారాణి
జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆమె అన్నారు. అర్హులైన వారికి పథకాలు అందలేదని అచ్చెన్నాయుడు నిరూపిస్తారా? అంటూ సవాల్ విసిరారు. ఈ పథకాల్లో టీడీపీ నాయకుల కుటుంబాలు కూడా లబ్ది పొందుతున్నాయని, నిమ్మాడలో గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు పడలేదని, అదే ఊరిలో అమ్మఒడి, రైతు భరోసా తదితర పథకాలు అమలు కావడం లేదని నిరూపిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కృపారాణి వ్యాఖ్యానించారు.